పరుగుల వీరుడు.. రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. టెస్టుల్లో తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు
దాదాపు 1200 రోజుల అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకం నమోదు చేశాడు కింగ్ కోహ్లీ
దీంతో ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలకు ఈ ఇన్నింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు
ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో శతకం పూర్తి చేయగానే.. స్టేడియం అంతా ‘కోహ్లి.. కోహ్లీ’ అంటూ మారుమోగింది.
సెంచరీ పూర్తి చేయగానే కోహ్లీ బ్యాట్‌తో ప్రేక్షకులకు అభివాదం చేశాడు
ఆ తర్వాత తన లాకెట్‌ను ముద్దు పెట్టుకుని ఆకాశం వైపు చూస్తు సంబరాలు చేసుకున్నాడు
కోహ్లీకి సహచర ఆటగాళ్లతోపాటు.. ఆసీస్ ఆటగాళ్లూ చప్పట్లతో అభినందనలు తెలపడం విశేషం