పాక్‌పై విజయంతో ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు: కోహ్లీ

మహిళల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఎంతో ఉత్కంఠగా జరిగిన పోరులో ఉమెన్ ఇన్ బ్లూ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

కోహ్లీ ట్వీట్

పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయం సాధించినందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేనను కోహ్లీ ప్రశంసించాడు.

పాక్‌పై భారీ విజయం సాధించినందుకు కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు.

భవిష్యత్తులో చాలా మంది యువతులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు మార్గం సుగమం చేశారని కొనియాడాడు.

"అధిక ఒత్తిడితో కూడిన గేమ్, కఠినమైన పరుగుల వేటలో మా మహిళల జట్టు పాకిస్తాన్‌పై విజయం సాధించింది" అంటూ కోహ్లీ పోస్ట్ చేశాడు.

"మహిళా క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి స్ఫూర్తినిస్తుంది. మీ అందరికీ మరింత శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని కోరుకున్నాడు.

టాస్ గెలిచిన పాకిస్తాన్ బోర్డుపై 149 స్కోరు చేసింది. స్కిప్పర్ బిస్మా మరూఫ్ 55 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

అయితే, 18 ఏళ్ల ఆయేషా నసీమ్ 25 బంతుల్లో 43 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

అనంతరం జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన అర్ధ సెంచరీతో ఉద్విగ్నభరితమైన ఛేజింగ్‌లో భారత్‌ను విజయ తీరాలకు చేర్చింది.

రిచా ఘోష్ 20 బంతుల్లో 31 పరుగులతో పాకిస్తాన్ నుంచి ఆటను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

జెమీమా, రిచా 58 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే గెలిచింది.