టెస్టుల్లో 'హ్యాట్రిక్' ఫ్లాప్‌లు.. 2020 నుంచి తుస్సుమన్న కోహ్లీ..

భారత జట్టులోని స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో ఫ్లాప్ అవుతున్నాడు.

బ్యాటింగ్ సగటు మూడు సంవత్సరాల్లో 30 కంటే తక్కువగా ఉంది.

ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో కోహ్లీ బ్యాట్‌ నుంచి ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది.

గత మూడేళ్లలో విరాట్ టెస్టు గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

2020లో కోహ్లి 3 మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ధ సెంచరీతో కేవలం 19.33 సగటుతో 116 పరుగులు చేశాడు.

2021లో కోహ్లీ 11 టెస్టు మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌ల్ 4 హాఫ్ సెంచరీలతో 28.21 సగటుతో 536 పరుగులు చేశాడు.

2022లో కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లలో 6 మ్యాచ్‌లలో ఒక హఫ్ సెంచరీతో 26.50 సగటుతో 265 పరుగులు చేశాడు.

2017, 2018, 2019లో కోహ్లి సగటు 50కి పైగానే ఉంది. ఈ మూడేళ్లలో మొత్తం 12 సెంచరీలు చేశాడు.

2017లో 75.64 సగటుతో 1059 పరుగులు చేశాడు.

2018లో 55.08 సగటుతో 1322 పరుగులు చేశాడు.

2019లో 63.28 సగటుతో 612 పరుగులు చేశాడు.

ఇక్కడ క్లిక్ చేయండి