టెస్టుల్లో కోహ్లీకి 12 సంవత్సరాలు.. విరాట్ సాధించిన ఘనతలివే..
2011 జూన్ 20న టెస్ట్ ఆరంగేట్రం చేసిన కోహ్లీ ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సుదీర్ఘ కాలంలో కోహ్లీ సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం..
వెస్టీండిస్‌పై టెస్ట్ ఆరంగేట్రం చేసిన కోహ్లీ తొలి మ్యాచ్‌లో 19(4, 15) పరుగులే చేశాడు. విశేషమేమిటంటే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫిడెల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లోనే విండీస్ వికెట్ కీపర్ కార్ల్టన్ బాగ్ చేతికి చిక్కాడు.
అడిలైడ్ వేదికగా 2012 జనవరిలో ఆస్టేలియాపై కోహ్లీ తన తొలి టెస్ట్ సెంచరీ చేశాడు.
విరాట్ టీమిండియాకు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్. 68 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ 40 విజయాలు అందించాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ వరుసగా ఐదేళ్లు ఐసీసీ టెస్టు మ్యాస్‌ను గెలుచుకుంది.
సర్ డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత కెప్టెన్‌గా ఒకే టెస్టు సిరీస్‌లో 600కి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ.
అత్యధిక సెంచరీలు సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ 20 టెస్టు సెంచరీలు చేయగా, గ్రేమ్ స్మిత్ 25 శతకాలు చేశాడు.
భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు (8479) చేసిన లిస్టులో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కంటే ముందు సచిన్, ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ ఉన్నారు.
విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(2016లో) నిలిచాడు. కోహ్లి ఇప్పటి వరకు ఏడు డబుల్ సెంచరీలు కొట్టాడు
రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుచుకున్న తొలి భారత కెప్టెన్ విరాట్.
విరాట్ ఇప్పటి వరకు 109 టెస్టులు ఆడి, 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు, 28 అర్థ సెంచరీలు ఉన్నాయి.