కేవలం నటుడి గా మాత్రమే కాదు ఆయన ఒక ప్లే బాక్ సింగర్ మరియు నిర్మాత. కెరీర్ మొదట్లో సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
కానీ ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడంతో దూరదర్శన్ లో గలాట కుటుంబం అనే ఒక సీరియల్ లో నటించాడు.
ఆ తర్వాత రెండేళ్లకు ఎన్ కాదల్ కన్మణి అనే ఒక సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
అనేక ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత తెలుగులో సైతం కొన్ని సినిమాలు తీశాడు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో నటించాడు.
దాదాపు 10 ఏళ్లపాటు అతనికి సరైన హిట్టు లేదనే చెప్పాలి.ఆ టైం లో మల్టీ స్టారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు.
ఇక దర్శకుడు బాల తొలిసారిగా తీసిన సేతు సినిమా హిట్ అయ్యేవరకు విక్రమ్ చేతిలో సరైన హిట్ లేదు.
ఇక ఆ తర్వాత అతని నటనా పరంపర అంచేలంచలుగా ఎదిగి తమిళంలోనే ఒక స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్.
చాలా మంది కి తెలియని విషయం ఏమిటి అంటే విక్రమ్ సేతు సినిమాలతో పాటు తన తోటి హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పేవాడు.
అందుకే డబ్బింగ్ చెబుతూ కాస్త డబ్బులు కూడబెట్టుకునేవాడు.
తాను డబ్బింగ్ చెప్పిన హీరోలలో ప్రభుదేవా, అబ్బాస్, ప్రశాంత్, వినీత్, అజిత్ వంటి వారు ఉన్నారు.