యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం ఖరారైంది

‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు 

విజయ్‌ దేవరకొండకి ఇది 12వ చిత్రం 

ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం ఈ కలయికలోని సినిమాని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది

ఈ చిత్రంలో విజయ్‌ ఓ అజ్ఞాత గూఢచారిగా కనిపించనున్నట్టు చిత్రబృందం రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ద్వారా తెలుస్తుంది

‘‘విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా అంచనాల్ని అధిగమించేలా ఉంటుంది. ఓ అద్భుతమైన విషయం ఇందులో ఉంటుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు 

ఈ చిత్రంతో విజయ్‌ నటనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి వెల్లడించారు