కోలీవుడ్‌లో పలు హిట్ సినీమాల్లో నటిస్తూ స్టార్‌ హీరోగా రాణిస్తున్నరు విజయ్‌సేతుపతి

తర్వాత తెలుగులో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు పొందుతూ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

బాలీవుడ్‌లో వెబ్‌ సీరీస్‌లో నటిస్తూ పాన్‌ ఇండియా నటుడుగా ఎదిగారు

కాగా అయన తాజాగా తమిళంలో మరో చిత్రానికి ఓకే  చెప్పారని, దీనికి మహారాజా అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం

ఈ చిత్రానికి  కురంగు బొమ్మై మూవీ ఫేమ్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం

ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టెయిన్‌ కథా చిత్రంగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది

నటుడు నటరాజన్‌ ముఖ్యపాత్రలో కనిపించనునట్లు సమాచారం

కాగా విజయ్‌సేతుపతి దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నటించనునట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే