‘విక్రమ్‌’విజయం తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం చిత్రం ‘లియో’

ఈ చిత్రంలో విజయ్‌ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు

సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో మైనస్‌ 12డిగ్రీల ఉష్ణోగ్రతలో జరుగుతోంది

ఈ విషయాన్ని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ మిస్కిన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు

ప్రస్తుతం విజయ్‌, త్రిష, గౌతమ్‌ మేనన్‌లతో సుమారు 500మంది సిబ్బందితో ఆ గడ్డ కట్టించే చలిలో షూట్ చేస్తున్నట్లు చెప్పారు

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాల తర్వాత ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త చిత్రమిది

విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఈ మూవీలో కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్ గా  కనిపించనున్నారు

ఈ చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది