ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రం విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో సమంతకు ప్రేక్షకులతో పాటు సినీ రంగ ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సమంతకు విషెష్ చెప్పారు.
ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్ చేసారు
ఈ లేఖలో “సామ్మీ.. నువ్వు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ఇతరులతో ప్రేమగా ఉంటావు.
ఎంపిక చేసుకునే సినిమాలపై కూడా కెరీర్ ఆధారపడి ఉంటుందని భావిస్తావు.
అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా.. అభిమానులు, సినిమాల కోసం చిరునవ్వుతో ముందు అడుగు వేస్తుంటావు.
శాకుంతలం సినిమాకి శుభాకాంక్షలు. లక్షలాది మంది అభిమానుల ప్రేమ.. నీ సంకల్పమే నిన్ను కాపాడుతుంది” అని రాసుకొచ్చారు
విజయ్ పోస్ట్ చేసిన ఈ లేఖకు సమంత సైతం స్పందించారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ ప్రేమ చాలా అవసరం. థ్యాంక్ యు మై హోరో అని రాసుకొచ్చారు సమంత.