టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇప్పుడిప్పుడే ఈయన లైగర్ సినిమా ప్రభావం నుంచి బయటపడుతూ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ సమంతతో కలిసి ఈయన ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
గీతగోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో మరోసారి ఈయన నటించబోతున్నారు.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.
విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం మరోసారి సీనియర్ హీరోయిన్ అయినటువంటి పూజా హెగ్డేని సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
పూజా హెగ్డే విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా జనగణమన సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం తిరిగి పూజ హెగ్డేనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.