విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది.
‘గీత గోవిందం’ లాంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
ఈ చిత్రంలో విజయ్‌కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
హీరో హీరోయిన్లపై రూపొందించిన ముహూర్తపు షాట్ కి ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు.
ఈ సీన్ కోసం ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరా స్విచ్చాన్ చేయగా గోవర్ధన్‌రావు దేవరకొండ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం విజయ్‌కి ఇది 13వ సినిమా, అలాగే నిర్మాణ సంస్థకి 54వ సినిమా.
‘‘ప్రీప్రోడుక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం.
రెగ్యులర్ చిత్రీకరణ త్వరలోనే మొదలు పెడతాం’’ అని తెలిపారు మూవీ మేకర్స్.