క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
యాడ్ షూట్ కోసం చెన్నైకు వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించాలనుకున్నాడు.
కథ గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘మిగతా విషయాలు మనం రూమ్‌కు వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నాడు.
ఒక్కదానినే ఉండటం వల్ల భయపడుతూనే రూమ్‌కి వెళ్లాను. అక్కడికి వెళ్లిన వెంటనే తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే పెట్టాను.
అతడికి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆ క్షణం అలా చేయమని నాకు ఎవరూ సలహాలు ఇవ్వలేదు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్నా’’ అని వివరించింది.
అందుకే నా తల్లిదండ్రులు భయపడి నన్ను సినిమాల్లో పంపించడానికి అంత ఇష్టపడలేదు’’ అని విద్యాబాలన్ తెలిపింది.