క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నోరు విప్పారు.

తాజాగా మరో హీరోయిన్‌ విద్యాబాలన్‌ కాస్టింగ్ కౌచ్  తానూ ఎదుర్కొన్నానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పరిశ్రమకి వచ్చే ముందు ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయని చాలా మంది చెప్పారన్నారు.

అందుకే ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తన పేరెంట్స్‌ భయపడ్డారని చెప్పారు.

తనకు ఒక సంఘటన ఎదురైందని, ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాలని చూశాడని చెప్పారు.

ఒక సినిమా గురించి మాట్లాడటానికి ఓ కాఫీ షాప్ కి వెళ్లాం. కథ మధ్యలో మనం రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందా మన్నాడు ఆ దర్శకుడు.

ఆయన మాటని నమ్మి వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాతకానీ నాకు అతని ఇంటెన్షన్ అర్థంకాలేదు..

రూమ్ కి వెళ్లిన వెంటనే ఆ గది తలుపులు తెరిచే  ఉంచాను. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక..

అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు అని తెలిపారు విద్య బాలన్.