ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ మొదటిసారి విలన్ గా నటిస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది
కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో వెన్నెల కిశోర్ విలన్ రోల్ చేస్తున్నాడన్న వార్త వినిపిస్తుంది
ఈ విషయమై ఓ ఫ్యాన్ 'ఏంటి కాకా.. ఇది నిజమా?' అని ప్రశ్నించాడు
ఈ నేపథ్యంలో వెన్నెల కిశోర్ ఈ విధంగా స్పందించారు
'ఇండియన్ 2లో లేను, పాకిస్తాన్ 3లో లేను' అని తెలిపారు
వెన్నెల కిశోర్ స్పందనతో ఈ పుకారుకు ఎండ్ కార్డు పడింది
దింతో అభిమానులు థ్యాంక్స్ భయ్యా క్లారిటీ ఇచ్చినందుకు అని కామెంట్లు చేస్తున్నారు