అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది

గతేడాది ‘ఎఫ్‌3’ హిట్ తర్వాత ఆయన ‘ఓరి దేవుడా’లో దేవునిగా అతిథి పాత్రలో కనిపించరు 

సోలోగా చేయనున్న మూవీస్ విషయంలో కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా... అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయి

ఈమధ్యే శైలేష్‌ కొలనుతో సినిమాకి వెంకటేష్‌ ఓకే చెప్పినట్టు చిత్ర వర్గాల్లో సమాచారం

‘హిట్‌’ సిరీస్‌ చిత్రాలతో విజయాల్ని అందుకున్న శైలేష్‌ కొలను ఈసారి కూడా ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథని వెంకటేష్‌కి వినిపించారని సమాచారం 

అది వెంకటేష్‌కి బాగా నచ్చడంతో షూటింగ్ ప్రారంబిస్తున్నట్టు తెలుస్తోంది

వచ్చే నెల నుంచే ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం

ఈ చిత్రంలో కథానాయకిగా ‘కె.జి.ఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి  నటించనున్నారని వార్త వినిపిస్తుంది