జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే వివాహం విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుందట

మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

పెళ్లికాని స్త్రీ ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలి. అవివాహితుడైన యువకుడు ఈశాన్య దిశలో పడుకోవాలి

పింక్, పసుపు, లేత ఊదా, తెలుపు వంటి లేత రంగు బెడ్ షీట్ మీద నిద్రించడం మంచిది

పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి మంచం కింద ఎలాంటి ఇనుప వస్తువును పెట్టుకుని పడుకోకూడదు

ఇంటి మధ్యలో బరువైన వస్తువులు లేదా మెట్లను ఉంచడం మంచిది కాదు

ఇల్లు మొత్తం లేత రంగుల గోడలు ఉండాలి. గోడ కోసం పాస్టెల్ రంగులను ఎంచుకోవడం మంచిది

వాస్తు శాస్త్రం ప్రకారం.. అవివాహిత స్త్రీ పురుషులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి