గోడ గడియారాలు ఎల్లప్పుడూ పనిచేస్తుండాలి. పని చేయని వాటిని ఇంట్లో నుంచి పడేయాలి
గోడ గడియారాలను ఇంటి తూర్పు, పడమర, ఉత్తరం వైపు గోడకు పెట్టుకోవాలి
ఆకుపచ్చ రంగు గోడ గడియారాలను ఇంట్లో పెట్టొద్దు
ఇంటి నేమ్‌ప్లేట్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి
దక్షిణ, పడమర గోడల వెంట భారీ ఫర్నిచర్ ఉంచండి. అయితే తేలికపాటి ఫర్నిచర్ ఉత్తర, తూర్పు గోడల వైపునే ఉంచాలి
చెక్క ఫర్నిచర్‌ను ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించండి
ఇంటి ముఖద్వారం వద్ద తులసి మొక్కను నాటండి
తులసి మొక్కను ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి. లేదంటే.. ఉత్తరం, ఈశాన్యం దిశలో కిటికీ దగ్గర కూడా ఉంచవచ్చు
షూ రాక్ ఉంచడానికి పశ్చిమ, నైరుతి మూల ఉత్తమం. అయితే, ఉత్తర, ఆగ్నేయం, తూర్పు దిశలలో అస్సలు షూ స్టాండ్ పెట్టకూడదు