డేరింగ్‌ అండ్‌ బోల్డ్‌ యాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్‌ పోడా పోడీ చిత్రంలో నటుడు శింబు పక్కన హీరోయిన్ గా పరిచయమైంది

ఈమె తర్వాతి కాలంలో ట్రెండ్‌ మార్చుకుని విలన్ గా కనిపిస్తున్నారు

అప్పటి నుంచి ఆమెకు ప్రశంసలతో పాటు విజయాలు వస్తున్నాయి

తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లోనూ వరలక్ష్మి శరత్‌కుమార్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉంది

విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రకైనా సిద్ధం అంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది

సంక్రాంతి బరిలోకి దిగుతున్న బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మూవీలో ఈమె ప్రతినాయకిగా కనిపించనుంది

ఇటీవల ఒక మీట్ లో విలన్ గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు గ్లామర్‌ పాత్రలు తనకు వర్కౌట్‌ కాదని అందుకే తాను విలన్ బాటను ఎంచుకున్నానని వరలక్ష్మి తెలిపారు

తాను విలన్ పాత్రల్లో నటిస్తూన్నా సంతోషంగానే ఉన్నానని ఆమె తెలిపారు