నిజంగా భారతదేశంలో కోట్ల విలువ చేసే చాలా బంగారం ఉంది

భారతదేశంపై బ్రిటిషర్లుతో పాటు చాలామంది దండెత్తి వేల టన్నుల బంగారాన్ని దోచుకెళ్లినప్పటికీ ఇండియాలో గోల్డ్ భారీగానే ఉంది

దేశంలోని ప్రజలు, బ్యాంకులు, లాకర్లు, సేఫ్ లలో  టన్నుల కొద్దీ ఉన్న బంగారం అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ

భారతీయ మహిళలు బంగారాన్ని తమ దగ్గర ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు

తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతీయ మహిళల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని సమాచారం

భారత కరెన్సీలో ఈ బంగారం విలువ అక్షరాలా రూ.107 లక్షల కోట్లని ఈ నివేదికలో వెల్లడైంది

ఇంత బంగారం ఉన్నప్పటికీ భారతీయులు ఇంకా కొంటునే ఉండడంతో వ్యాపారులు విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు

అమెరికా, జర్మనీ, రష్యా కంటే భారతీయ మహిళల దగ్గరే ఎక్కువ బంగారం ఉన్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది