‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు
పవన్‌కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం గత డిసెంబరులోనే లాంఛనంగా ప్రారంభమైంది
బుధవారం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో తీర్చిదిద్దిన పోలీస్ స్టేషన్ సెట్లో చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు మేకర్స్
ఈ షెడ్యూల్‌లోనే పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని షూట్ చేయనున్నారు
దిల్లీ నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కి వచ్చిన పవన్‌కల్యాణ్ బుధవారం నుంచే ఈ సెట్లోకి దిగారు
ఈ సందర్భంగా ఉస్తాద్ ఊచకోత షురూ అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు