హరీష్‌ శంకర్‌ దర్సకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా  తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.

‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్ బూస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది.

కాగా ‘గబ్బర్‌సింగ్‌’ విడుదలై  ఈనెల 11 నాటికి 11 ఏళ్లు పూర్తి కానుంది.

ఈ సందర్భంగా ఈనెల 11న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి తొలి గ్లింప్స్‌ రిలీజ్ చేయనిది చిత్రబృందం.

తాజా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్.

ఇటీవలే ఈ చిత్రం  మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈనెలలోనే తర్వాతి షెడ్యూల్‌ షూటింగ్  ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీలీల కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.