యంగ్‌ హీరో అఖిల్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఏజెంట్‌’.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

అఖిల్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆడిపాడనుందని అంటున్నారు.

ఇప్పటికే అఖిల్‌ లుక్‌, పోస్టర్లతో ‘ఏజెంట్‌’పై అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమాలోని ఐటెమ్‌ సాంగ్‌ కోసం ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా ను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం.

దీనికి ఆమె ఓకే అన్నట్లు తెలుస్తోంది. తాజాగా అఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట గురించి చెప్పారు.