ఫీచ‌ర్ ఫోన్ తో UPI పేమెంట్స్.. తెలుగు వాయిస్‌తోనే..

యూపీఐ నుంచి పేమెంట్స్ అనేది ఇంతకుముందు కేవలం స్మార్ట్ ఫోన్స్ ఉన్న వారికే మాత్రమే అందుబాటులో ఉండేది.

అదే 'యూపీఐ 123పే' ఆఫ్షన్. ఈ ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన భాష‌లో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు.

టోన్‌ ట్యాగ్ సంస్థ కొత్త సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సంస్థ దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల సహాయంతో 'యూపీఐ 123 పే' సేవ‌ల‌ను లాంచ్ చేసింది.

డిజిటల్ చెల్లిపుల్లో పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న అంత‌రాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.

డిజిటల్ చెల్లిపుల్లో పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న అంత‌రాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో  పేమెంట్స్ చేసేందుకు అవకాశం ఉంది.

త్వ‌ర‌లోనే గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి మ‌రికొన్ని భాష‌ల‌లో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చంట.

ఈ సేవ కోసం యూజర్లు 6366 200 200 ఐవీఆర్ నంబ‌ర్‌కు కాల్ చేసి వారి ప్రాంతీయ భాష‌ను ఎంపిక చేసుకుని పేమెంట్స్ చేయవచ్చు.

అయితే, ఈ సేవ‌లతో మనీ ట్రాన్సఫర్  చేయ‌లేరు.

యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి వాయిస్ ఉప‌యోగించి చేసుకోవచ్చు.

ఎన్ఎస్‌డీఎల్ పేమెంట్స్ బ్యాంక్‌, ఎన్‌పీసీఐ భాగ‌స్వామ్యంతో ఈ సదుపాయాన్ని ఈ సంస్థ తీసుకొచ్చింది.