మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది.
తాజాగా ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చెర్రీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేక విషెస్ చెప్పారు.
అయితే త్వరలోనే రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.
ఉపాసన తన ట్విటర్‌లో రాస్తూ.. ' హ్యాపీ బర్త్ డే మై బెస్టీ' అంటూ రామ్ చరణ్‌తో ఉన్న రెండు ఫోటోలను ఆమె పంచుకున్నారు.
ఇది చూసిన మెగా ఫ్యాన్స్ మరోసారి చరణ్ అన్నకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్‌సీ 15 చిత్రబృందం డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
చెర్రీ తాజా చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.