ఇటీవలే ప్రెగ్నన్సీ కబురుతో మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ప్రస్తుతం హస్బెండ్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తోంది.
ఇలాంటి తరుణంలో.. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన డెలివరీ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
చరణ్ మాటలకు జెన్నిఫర్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని దగ్గరుండి డెలివరీ చేయడం తనకెంతో గౌరవమని, అందుకోసం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్పింది.
గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రామ్ లో చరణ్ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉపాసన కొన్ని రోజులు అమెరికాలో ఉంటుందని అన్నారు
ఆమెకు మీరు అందుబాటులో ఉంటే బాగుంటుందని చరణ్.. జెన్నిఫర్ ఆస్టన్ కి సూచించారు.
దీంతో జెన్నిఫర్ మాటలను దృష్టిలో పెట్టుకొని.. కొంతమంది సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందంటూ ప్రచారం చేశారు.
దీనిపై స్పందిస్తూ ఉపాసన తాజాగా ట్వీట్ పెట్టారు. “డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ మీరు చాలా స్వీట్. మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా.
దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్ ఫ్యామిలీలో భాగమవ్వండి. ఇక్కడి వైద్యులు సుమన మనోహర్, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి” అంటూ ట్వీట్ లో పేర్కొంది.