మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలోకి మరో అతిథి వస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. మొన్నటి మొన్న ఉపాసన సీమంతం వేడుకను దుబాయ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా హైదరాబాద్‌లో ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి నివాసంలో ఉపాసనకు బుధవారం బేబీ షవర్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మెగా వారసుడు లేదా వారసురాలు ఎప్పుడొస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో తమ ఇంటికి బుల్లి అతిథి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు ఉపాసన.ఉపాసన మాట్లాడుతూ.. డాక్టర్లు తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సమయంలో చరణ్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. పుట్టిన బిడ్డను స్వయంగా చూసుకుంటనే తన కెరీర్‌పై దృష్టిసారిస్తానని ఉపాసన తెలిపారు.