ఈ ప్రపంచం రకరకాల రహస్యాలతో నిండి ఉంది. అలాంటి అనేక రహస్యాలను ఇప్పటివరకు ఎవ్వరూ చేధించలేదు

సిరియా నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా వరకు వ్యాపించిన ఈ వింత బొమ్మల రహస్యం ఇప్పటికీ ఎవ్వరూ చేధించలేదు

ఈ బొమ్మలు సుమారు 8,500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవి. అయితే వీటిని ఎవరు తయారు చేసారు ఎందుకు తయారు చేశారు అనేది ఎవ్వరికి తెలియదు

టిబెరిస్ సరస్సు అని పిలువబడే 'గలిలీ సముద్రం' ఇజ్రాయెల్‌లో ఉంది. నీటి అడుగున చిన్న రాళ్లతో చేసిన భారీ బొమ్మలు వేల సంఖ్యలో ఉన్నాయి

వీటిని సుమారు 4,000 సంవత్సరాల క్రితం తయారు చేసినట్లు చెబుతారు కానీ ఎందుకు చేశారో ఎవరికీ సమాధానం తెలియదు

నాలుగు వైపులా నీరు ఉన్న ఈ ప్రదేశం. ఆస్ట్రేలియాలోని టెంవెన్ ద్వీపానికి సమీపంలో ఉంది. దీనిని 'దేవుడు సృష్టించిన నగరం' అంటారు

శిథిలావస్థకు చేరిన ప్రాంతంగా కనిపించే ఈ ప్రదేశం వేల సంవత్సరాల నాటిదని చెబుతారు కానీ ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు

ఈ వింత వృత్తాకార ఆకారం జర్మనీలోని గోసెక్ అనే చిన్న పట్టణంలో ఉంది. దీనిని కొందరు 'జర్మన్ స్టోన్‌హెంజ్' అని పిలుస్తారు

250 అడుగులకు పైగా విస్తరించి ఉన్న ఈ బొమ్మను సుమారు 4,900 సంవత్సరాల క్రితం రూపొందించినట్లు చెబుతారు. అయితే దీన్ని ఎవరు రూపొందించారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది