యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఉమామహేశ్వర స్వామి ప్రధాన దేవునిగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపిస్తారు
యాగంటి క్షేత్రంలో ప్రకృతి అందాలు భక్తులను అలరిస్తాయి. శిల్పి చెక్కినట్టుగా పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి
యాగంటి క్షేత్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు ఆకర్షిస్తాయి
యాగంటి వైష్ణవ క్షేత్రం కావలిసింది కానీ విగ్రహంలో లోపం కారణంగా స్వయంబుగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారట
ఇక్కడ ఉన్న కోనేరులో అగస్త్యుడు స్నానం చేసాడు అయన పేరుతోనే దీనికి అగస్త్య పుష్కరిణి అనే పేరు దీనికి వచ్చింది
ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని భక్తుల నమ్మకం
ఇక్కడ అగస్త్యుడి తపస్సు చేస్తున్న సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించాయట
అప్పుడు అగస్త్యుడు ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. దీంతో అప్పటి నుంచి ఇక్కడ కాకులు కనిపించవట
ఇక్కడ ఉన్న నంది నానాటికీ పెరుగుతూ కలియుగాంతం అరుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు