శ్రీకాకుళం జిల్లాలోని వంశధారా నది ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రం శ్రీకూర్మం
శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింప వేయబడుతాయని విశ్వాసం
కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర
కర్పూరేశ్వరుడు, హఠకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న క్షేత్రం
ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది
క్షేత్రం కృతయుగం నాటిది. దేవతలచే నిర్మించబడిన ఆలయం. మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట