సింహాలు లేదా పాములు వంటి జంతువుల కంటే దోమలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఆడ దోమ ఒకేసారి దాదాపు 300 గుడ్లు పెడుతుంది. అదే సమయంలో ఒక దోమ జీవితకాలం రెండు నెలల కన్నా తక్కువ
మగ దోమలు 10 రోజులు, ఆడ దోమలు 6 నుంచి 8 వారాల వరకు జీవిస్తాయి
దోమలకు జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. మీరు దోమను చంపడానికి ప్రయత్నిస్తే అది కనీసం 24 గంటలు మీ చుట్టూ ఉండదని పరిశోధనలో రుజువైంది
దోమలు ఒకే కాటుతో 0.001 నుంచి 0.1 మి.లీ వరకు రక్తాన్ని పీల్చుకోగలవు
మగ దోమలు ఎప్పుడూ కరవవు. ఎప్పుడు ఆడ దోమలు మాత్రమే మనుషులను కరుస్తాయి
ఎందుకంటే ఆడ దోమకు గుడ్ల అభివృద్ధికి ప్రోటీన్ అవసరం అది మనుషుల రక్తంలో ఉంటుంది