రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన పూజా సింగ్ షెకావత్ దేవుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది

పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేసిన పూజా సింగ్‌ను ఇప్పుడు అందరూ నవయుగ మీరాబాయితో పోలుస్తున్నారు

ఈ ఆశ్చర్యకరమైన వివాహంలో గణపతి పూజ మొదలు మెహందీ, సంగీత్‌ ఇతర ఆచారాలన్నీ పాటించారు.

పెళ్లికొడుకు రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఆలయం నుంచి ఇంటి వద్దకు తీసుకొచ్చి మంత్రోచ్ఛారణలతో 7 ప్రదక్షిణలు చేశారు.

కూతురు పూజ నిర్ణయంతో కోపోద్రిక్తుడైన తండ్రి పెళ్లికి హాజరుకాలేదు.

కానీ, ఆమె తల్లి రతన్ కన్వర్ దీనికి మద్దతుగా నిలిచి, కన్యాదానం చేసింది.

చిన్న చిన్న విష‌యాల‌కే భార్య‌భ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డ‌డం చూశాను. 

భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్లయిన జంటల కష్టాలు చూసే పూజ దేవుడిని పెళ్లి చేసుకుంది.

మరోవైపు పూజ పెళ్లి చేసుకోలేదని బంధువులు, ఇరుగుపొరుగు వారు వెక్కిరించడం ప్రారంభించారు. 

అన్నింటితో విసిగిపోయిన పూజ విష్ణువును పెళ్లి చేసుకోవాల‌నుకుందట.

పూజ ఇంట్లోనే విష్ణువు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్ర‌తిరోజు ఆ విగ్ర‌హాన్నే పూజిస్తూ గ‌డ‌ప‌నుంది.