తమిళ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అర్జున్‌దాస్
ఇటీవల తెలుగులో తొలిసారిగా ‘బుట్టబొమ్మ’ చిత్రంలో నటించారు
భీకరమైన తన గొంతుతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నరు అర్జున్‌దాస్. బుట్టబొమ్మలో తెలుగులో డబ్బింగ్ చెప్పి మెప్పించారు
అయితే తాజాగా తెలుగులో డబ్బింగ్ చెప్పిన అనుభవం గురించి అర్జున్‌దాస్ మాట్లాడారు
నాకున్న గొంతు ఇంత ప్లస్ అవుతుందని నేను ఏనాడూ ఊహించలేదు. తమిళంలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి
అదే విధంగానే తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించేందుకు అడిగారు. కానీ ‘బుట్టబొమ్మ’లాంటి సినిమా కోసమే ఇంతకాలం ఎదురుచూశా
ఈ సినిమాతో తెలుగులో అడుగుపెట్టడం సంతోషంగా అనిపించింది. తెలుగులో కూడా నేనే డబ్బింగ్ చెప్పాలని నిర్మాత వంశీ అడిగారు
డబ్బింగ్ అంటే మాటలే కాదు.. భాషలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి. అందుకే ఆరంభం నుంచే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టా
థియేటర్‌లో నా మాటలకు వచ్చిన స్పందన చూశాకా ఎక్కడలేని సంతృప్తి కలిగింది
అందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని తెలిపారు అర్జున్‌దాస్