తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు.. ఈ షడ్రుచులతో అంటే 6 రుచులతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు

ఉగాది పచ్చడిలో శాస్త్రీయ, ఆధ్యాత్మికత మేళవించి ఉంటుంది

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ వంటివి వస్తుంటాయి

అన్నింటినీ సమానంగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలని చెప్పే ఆధ్యాత్మిక భావన ఉగాది పచ్చడిలోని ఆధ్యాత్మిక భావం

ఉగాది పచ్చడి చైత్రమాసంలో తీసుకోవడం వల్ల కడుపులో చెడు బ్యాక్టీరియా నశించి, ఆరోగ్యపరంగా శరీరానికి మేలు చేస్తుందనేది శాస్త్రీయ భావం

అందుకే ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండగ

ఉగాది ప్రత్యేకతల్లో ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ముఖ్యమైనది