గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి యూకో బ్యాంక్‌ నికర లాభం భారీగా పెరిగింది

మొండి బకాయిలు తగ్గడంతో మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.581.24 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది

ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.312 కోట్లతో పోలిస్తే 86 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడి

2022-23 ఏడాదికి గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.1,862 కోట్ల లాభం

అంతక్రితం ఏడాదిలో బ్యాంక్‌ రూ.930 కోట్ల లాభం

మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.4,361 కోట్ల నుంచి రూ.5,946 కోట్లకు చేరింది

వార్షిక ఆదాయం రూ.20,159 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం వ్యాపారం రూ.4.11 లక్షల కోట్లకు చేరింది