నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది

దాదాపు 23 రోజులపాటు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు.

అయితే ఆయన మరణం తర్వాత తారకరత్న గురించి నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు.

నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ నందమూరి అభిమానులకు ఆయనంటే ఎంతో అభిమానం.

ఇదిలా ఉంటే.. తారకరత్న కెరియర్ ప్రారంభంలో రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ఈశ్వర్.

 ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి చిత్రాన్ని కూడా తొలుత తారకరత్నతోనే చేద్దాం అనుకున్నారట.