హిందీ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటి తునిషా శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఓ సీరియల్ సెట్స్‌లో ఆత్మహత్యకు యత్నించగా ఆమెను అక్కడున్నవారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
తునిషా తన సహ నటుడు షీజన్ మహ్మద్ మేకప్‌లో రూమ్‌లో ఉరివేసుకున్నది
విరామం అనంతరం తిరిగి వచ్చిన షీజన్ లాక్ చేసిన ఉన్న డోర్ పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
మరో పది రోజుల్లో 21వ పుట్టిన రోజు వేడుక చేసుకోవాల్సిన తునిషా విగత జీవిగా మారడాన్ని బాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తునిషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఆఖరి పోస్ట్‌ను షేర్ చేస్తూ పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
తన ఫొటోను పంచుకుంటూ ‘‘అభిరుచితో పని చేసేవారు ఎప్పటికీ ఆగరు’’ అని వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే తునిషా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
‘ఫితూర్’ సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించారు. ‘బార్ బార్ దేఖో’, ‘కహానీ 2’, ‘దబాంగ్ 3’ చిత్రాల్లో మెరిశారు.