కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారిని రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు
వేంకటేశ్వరుని దివ్వ సన్నిధికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చి ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకుంటారు.
తిరుమలకు వచ్చిన భక్తులు తమ స్థాయికి తగినట్లు శ్రీవారికి కానుకలు సమర్పిస్తారు
వేంకటేశ్వరస్వామి సన్నిధికి నిన్న ఒక్కరోజే భారీ స్థాయిలో కానుకలు వచ్చాయి.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.16 కోట్లు వచ్చింది.
శ్రీవారిని నిన్న 69,781 భక్తులు దర్శించుకున్నారు
27,552 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
టోకెన్ లేని భక్తుల దర్శననికి నిన్న 20 గంటల సమయం పట్టిందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.