స్మార్ట్ ఫోన్ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌.. కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది

మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన కల్పించేందుకు ట్రూకాలర్‌ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ తీసుకొచ్చింది

కేవైసీ సంబంధిత, లోన్‌లు, ఛారిటీ, లాటరీ, బ్యాంకు సంబంధిత కొన్ని ఫ్రాడ్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌లు అప్పుడప్పుడు మొబైల్‌లకు వస్తుంటాయి

ట్రూకాలర్‌ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌తో వీటిని తేలికగా గుర్తించే అవకాశం వచ్చింది

యూజర్ రిపోర్ట్‌లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్‌ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుందన్నమాట

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులందరికీ దీనిని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది

ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌ వచ్చినప్పుడు ఈ కొత్త ఫీచర్‌ ఆధారంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపి, అప్రమత్తం చేస్తుంది

ఒకవేళ యాజర్‌ పొరపాటున ఆ ఫ్రాడ్‌ మెసేజ్‌ను ఓపెన్‌ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్‌ డిసేబుల్‌ చేస్తుంది