17 ఏళ్ల తర్వాత చిరంజీవికి జోడిగా..
‘భోళాశంకర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి.
దీని తర్వాతి చిత్రం కోసం నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతుంది.
ఈ చిత్రంలో ఓ యువ హీరోకి చోటుండగా.. దీన్ని సిద్ధు జొన్నలగడ్డ భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో చిరుకి జోడిగా త్రిష నటించే అవకాశం ఉంది.
ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది చిత్రబృందం.
17 ఏళ్ల క్రితం చిరు త్రిష హీరోహీరోయిన్లుగా ‘స్టాలిన్’ సినిమాలో నటించారు.
తర్వాత కొన్ని చిత్రాల్లో వీళ్ల కలయిక గురించి అనుకున్నా అది కుదరలేదు.
కల్యాణ్‌కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నఈ చిత్రం మలయాళం ‘బ్రో డాడీ’కి రీమేక్.
చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాత.