సమ్మర్ టూర్‌కి కర్ణాటకలో ఈ ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్..
08 April 2025
Prudvi Battula
మైసూర్: రాజ వారసత్వ అద్భుతమైన నిర్మాణ శైలిని చూడవచ్చు. ఐకానిక్ మైసూర్ ప్యాలెస్, ఉత్సాహభరితమైన దేవరాజ మార్కెట్, ప్రశాంతమైన చాముండి కొండలను వీక్షించవచ్చు.
కూర్గ్: ఉత్కంఠభరితమైన అబ్బే జలపాతాలను, పచ్చని కాఫీ తోటలతో ప్రకృతి అందాల మధ్య హాయిగా ఉండే హోమ్‌స్టేను ఆస్వాదించవచ్చు.
హంపి: పురాతన దేవాలయాలు, రాజ సముదాయాలు, భారీ రాతి నిర్మాణాలను వీక్షించవచ్చు. హేమకుట కొండ, మరపురాని సూర్యాస్తమాయం, కొరాకిల్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు.
గోకర్ణ: ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ రద్దీ ఉన్న బీచ్‌లను చూడవచ్చు. ఓం బీచ్, కుడ్లే బీచ్, మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.
చిక్కమగళూరు: పచ్చని ఎస్టేట్‌లను, ముల్లయనగిరి శిఖరానికి హైకింగ్, భద్ర వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించవచ్చు.
బాదామి పట్టడకల్, ఐహోళే: బాదామిలోని రాతితో చేసిన గుహ దేవాలయాలు, పట్టడకల్‌లోని యునెస్కో జాబితాలో ఉన్న చాళుక్య దేవాలయాలు చూడవచ్చు.
బెంగళూరు: లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్, కబ్బన్ పార్క్‌ను సందర్శించవచ్చు. నగరంలోని ఉత్సాహభరితమైన రాత్రి జీవితం, విభిన్న వంటకాల రుచి చూడవచ్చు.
జోగ్ జలపాతం: భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటైన శివమొగ్గలోని జోగ్ జలపాతం. ఇది చాల అద్భుతమైన జలపాతం.