ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ తో ఈ ఆరు దేశాల్లో తిరగవచ్చు
TV9 Telugu
ఏదైనా ప్రాంతానికి కానీ, దేశానికి కానీ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం యొక్క అందాల్ని ఆస్వాదించాలంటే రోడ్ ట్రిప్ ఒక్కటే సరైంది.
అయితే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ 6 దేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేస్తూ వాహనాలు నడపవచ్చు.
స్విట్జర్లాండ్ అందాల్ని ఎంజాయ్‌లంటే రోడ్ ట్రిప్ మంచి మార్గం. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఒక ఏడాది వరకూ వాహనాలు డ్రైవ్ చేయవచ్చు.
స్వీడన్ దేశంలో అందాల్ని ఎంజాయ్‌లంటే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. మీ లైసెన్స్ స్వీడిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, నార్వే భాషల్లో ఏదైనా ఒక భాషలో ప్రింట్ కావల్సి ఉంటుంది.
స్పెయిన్ అందాల్ని వీక్షించడానికి కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వాడవచ్చు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
సింగపూర్ అందమైన ప్రాంతాలు వీక్షించడానికి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. సింగపూర్‌లో 18 ఏళ్లుంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత పొందుతారు.
మారిషస్‌లో 4 వారాల వరకూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అవుతుంది. ఆ 4 వారాలు నిరభ్యంతరంగా మారిషస్‌లో తిరగవచ్చు.
అమెరికాలో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. దీనికిగాను డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కారు రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.