రైలు ఆపేందుకు చాలామంది గొలుసు లాగుతారు. అలాంటి వారు ముందు రైల్వే నియమాలను తెలుసుకోవాలి.

చైన్ పుల్లింగ్ వల్ల రైల్వేకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఇంకా ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది

చైన్ లాగడం వల్ల రైలు పట్టాలు తప్పే ప్రమాదం కూడా ఉన్నందున ఇతర ప్రయాణీకుల ప్రాణాలు కూడా పోతాయి.

ఎటువంటి కారణం లేకుండా రైలు చైన్ లాగితే.. ఇది రైల్వే చట్టంలోని సెక్షన్ 141 కిందకు వస్తుంది.

మీరు ఇలా చేస్తే, రూ.1,000 జరిమానా లేదా 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు.

రైల్వే రూల్ బుక్ ప్రకారం, కొన్ని పరిస్థితులలో మాత్రమే రైలు చైన్ పుల్లింగ్ చేయవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగాలని అధికారులు పేర్కొంటున్నారు