ఈటీవీలో ప్రసారామయ్య జబర్దస్త్ నటి రీతు చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది
ఆమె తండ్రి గుండెపోటుతో మరణించారు
ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సినీ ప్రముఖులు, జబర్దస్త్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేశారు
తండ్రి చనిపోవడంతో రీతు తీవ్ర భావోద్వేగానికి గురైంది
తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది రీతు
ఎమోషనల్ నోట్ తో తండ్రితో దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది
“నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీతో దిగిన ఫొటోను ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. నీతో దిగిన లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి.' అని పేర్కొంటూ పోస్ట్ చేసింది రీతు చౌదరి
ఆమెకు ఇంట్లో అందరి కంటే తండ్రి అంటేనే చాలా ఇష్టం అవడంతో ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది