ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరలు పెంపు.. ఎంత పెరుగుతాయో తెలుసా?

29 March 2024

TV9 Telugu

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyoya Kirloskar Motor) సెలెక్టెడ్ మోడల్ కార్ల ధరలు ఒకశాతం పెంచనున్నట్లు ప్రకటించింది. 

కిర్లోస్కర్‌

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టయోటా సంస్థ వెల్లడించింది. ధరల పెంపుపై కారణాలు తెలిపింది.

ఏప్రిల్‌ నుంచి

ఇన్ పుట్ కాస్ట్, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. 

ఇన్‌ ఫుట్‌ కాస్ట్‌

ఈ ఏడాది టయోటా కిర్లోస్కర్ తన కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరిలో తొలిసారి కార్ల ధరలు పెంచేసింది.

ఇది రెండో సారి

హ్యాచ్ బ్యాక్ మోడల్ గ్లాంజా నుంచి ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చూనర్ కార్ల ధరలు రూ.6.86 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.51.44 లక్షల వరకూ పెరుగుతాయని తెలిపింది. 

ఎస్‌యూవీ

హైలక్స్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి ధరలు కూడా పెరుగుతాయి.

వీటి ధరలు పెరుగుతాయి

ఇంతకుముందు మరో కార్ల తయారీ సంస్థ హోండా కార్ప్‌ ఇండియా సైతం వచ్చేనెల నుంచి అన్ని కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

హోండా కార్ప్‌

ఈవీ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టబోతోంది చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.

దక్షిణ కొరియా