ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఎన్ని దాఖలు అయ్యాయంటే..
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 3.7 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు అయ్యాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ డిసెంబర్ 31.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో, "ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి 17 డిసెంబర్ 2021 వరకు 3,71,74,810 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి ." అని వివరించింది
మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ITR1 (2.12 కోట్లు), ITR2 (31.04 లక్షలు), ITR3 (35.45 లక్షలు), ITR4 (87.66 లక్షలు), ITR5 (3.38 లక్షలు), ITR6 (1.45 లక్షలు), ITR7 (0.25 లక్షలు) రిటర్న్స్ దాఖలు అయ్యాయి.
డిసెంబర్ 31లోగా మీరు రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, రిటర్న్‌ను ఫైల్ చేయడానికి రూ.10,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల రూపాయల ఆదాయం మించని పన్ను చెల్లింపుదారులు ఆలస్య రుసుముగా వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించాలి.
జరిమానాతో పాటు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10A మరియు సెక్షన్ 10B కింద మినహాయింపు కూడా అందుబాటులో ఉండదు. అదే విధంగా ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసిన వారు సెక్షన్-80IA, 80IAB, 80IC, 80ID- 80IE కింద మినహాయింపు పొందరు.
అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారు IT చట్టంలోని సెక్షన్ 80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB- 80RRB కింద కూడా మినహాయింపు ప్రయోజనం పొందలేరు.