కింగ్ కోబ్రా గురించి చాలా మందికి తెలియని విషయాలివే.. తెలిశాక షాక్ అవ్వాల్సిందే..! స్థానికంగా నల్లత్రాచు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కింక్ కోబ్రాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు. ఈ పాము గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కింగ్ కోబ్రా ఒక కాటుతో గరిష్ఠంగా 7 లేదా 8 మి.లీ విషాన్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేయగలదు.
కింగ్ కోబ్రాలు ఒక్క కాటుతో 3 గంటల కంటే తక్కువ సమయంలోనే పూర్తిగా పెరిగిన ఓ ఏనుగును చంపగలవు.
ఈ పాములు దాదాపు 20 సంవత్సరాలు జీవించగలవని సైంటిస్టుల అంచనా.
కింక్ కోబ్రాలు జర్మన్ షెఫర్డ్ కేకలా సౌండ్ చేయగలవు.
కింగ్ కోబ్రాలు విశేష సంఖ్యలో ఇతర పాములను చంపి తింటాయి.
తన కోసం గూటిని నిర్మించుకునే ఏకైక పాము జాతి కింగ్ కోబ్రాలు.
ఇవి చాలా ఎత్తులు ఎక్కగలవు, ఇంకా సుదూరాల పాటు నీటిలో ఈదగలవు.
ఆడ కింగ్ కోబ్రాలు మగ పాముల కంటే చాలా పొడవుగా పెరుగుతాయి.
కింగ్ కోబ్రాలు ఆందోళన లేదా భయానికి గురైనప్పుడు పడగను విప్పుతాయి.
కింగ్ కోబ్రా వాటి తలను భూమి నుంచి కనీసం 6 లేదా 7 ఆడుగుల ఎత్తు వరకు పైకి లేపగలవు.