ఎండాకాలంలో మామిడిపండు తినాల్సింటే.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మామిడిపండు తొక్క, గుజ్జు, గింజలలో ఉండే పోషకాలు, పాలీఫెనాల్స్ టైప్ 2 డయాబెటిస్‌తో సహా క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.
రక్తంలో లిపిడ్‌ల స్థాయిని (కొలెస్ట్రాల్) నిర్వహించడానికి మామిడి పండ్లను తినడం మంచిది. ఇది గుండెకు మేలు చేస్తుంది..
మామిడిపండ్లు కెరోటినాయిడ్స్‌కు మంచి మూలం. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచడంలో సహాయపడుతుంది.
మామిడి పండ్లలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, సమస్యలను నిరోధించడంలో సహాయపడుతుంది
జీర్ణక్రియకు మామిడిపండ్లు మేలు చేస్తాయి. మామిడి పండ్లను ఎక్కువగా తినేవారిలో మలబద్ధకం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అందుకే మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు.. సీజన్ వచ్చింది కావున తినడం మంచిది..