చేపల్లో అన్ని రకాల పోషకాలు.. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ లభిస్తాయి.
అమైనో యాసిడ్స్ ఉండే మాంసాహారం ఒక్క చేపలే.
ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తుంటారు.
చిన్న చిన్న చేపల్ని ముల్లు సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ మన శరీరానికి అందుతాయి.
వీటిలో మాత్రమే దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.
వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. చేపలను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
గర్భిణీలు చేపలు తినడం వల్ల కడుపులో బిడ్డకు మంచి ప్రోటీన్లు అంది వారి మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
పెద్ద పేగు, మల ద్వార క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు నిత్యం చేపలు తినడం అవసరం.
పొట్ట లావు కాకుండా ఉండాలంటే వారంలో రెండు, మూడు సార్లయినా చేపలు తినాలని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు.
ఎముకల గట్టిదనానికి, దంతాలకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తోపాటు రక్తవృద్ధికి హీమోగ్లోబిన్ పెరిగేందుకు కావాల్సిన ఇనుము చేపల్లో ఎక్కువగా లభిస్తుంది.
స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.