కొబ్బరి నీరు: కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్‌లా ఎంత ఎంత ఎనర్జీ ఇస్తుందో తెలిసిందే. ఇది రక్తప్రసరణ మెరుగుపరిచి అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది.

వెల్లులి: ఒక నెల పాటు వెల్లులి క్రమం తప్పకుండా తింటే.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంగస్తంభన సమస్యలు ఉండవు.

బాదం: ఇందులో ఉండే జింక్, ఒమెగా-3 ఫ్యాట్ యాసిడ్స్ వల్ల అంగస్తంభన సమస్యలను రూపుమాపుతాయి.

అల్లం: వెల్లులి తరహాలోనే అల్లంలో కూడా రక్త ప్రసరణ మెరుపరిచే యాసిడ్స్ ఉన్నాయి.

మిర్చి: ఇందులో ఉండే రసాయనాలు గుండె వేగంతోపాటు కోరికలు పెంచుతాయి.

గుమ్మడి కాయ గింజలు: విటమిన్ బి, ఇ, సి, డి, కె, కాల్షియం, పొటాషియం, నియాసిన్, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఇందులో ఉన్నాయి.

మునగకాయలు: ఇందులో ఉండే జింక్ తదితర పోషకాలు అంగస్తంభనకు ఉపయోగపడతాయి.

పుచ్చకాయలు: సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం మూడ్‌ను ఉత్తేజితం చేస్తుంది. సెక్స్‌కు ప్రేరేపిస్తుంది.

గుల్లలు: దీన్ని ‘లవ్ డ్రగ్‌’గా పేర్కొంటారు. ఇందులో ఉండే జింక్.. ఆరోగ్యకరమైన వీర్య కణాలను, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది.

అవోకాడో: ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, విటమిన్-ఇ.. పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తి పెంచుతుంది.

అరటి పండ్లు:  ఇందులో సెక్స్ హార్మోన్లను పెంచే బ్రొమలెన్‌తో పాటు విటమిన్-బి ఉంటాయి.

బ్లాక్ చాక్లెట్: ఇది హృదయనాళ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి.

దానిమ్మ పండ్ల జ్యూస్:  అంగస్తంభనకు ఇది చక్కని ఔషదమని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.