పెరుగుకి బదులు దాని నుంచి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

 మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది.  

 మజ్జిగ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది.

 వాపు, జీర్ణ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత సమస్యలను నివారించడంలో మజ్జిగ సహాయపడుతుంది. 

చలికాలంలో అయితే అజీర్ణం సమస్య ఎదురవకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం సులభం. 

ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

 మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక.

ఇంకా మజ్జిగ శరీర బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు.. బరువు తగ్గాలంటే మజ్జిగ ఎంచుకోవాలి. 

మజ్జిగ తేలికగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది.